🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 20 Jun, 2026 | Page: 1

‘పుష్ప’ సీన్ రీక్రియేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లుకేమియాతో బాధపడుతున్న చిన్నారి శ్రద్ధ కోరికను తీర్చారు. మేక్-ఎ-విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆమెను కలిసిన అల్లు అర్జున్, ‘పుష్ప’ సినిమాలోని పాపులర్ మూమెంట్స్‌ను ఆమెతో కలిసి రీక్రియేట్ చేశారు. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియోను అల్లు అర్జున్ టీమ్ షేర్ చేయగా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.వీడియోలో అల్లు అర్జున్ నవ్వుతూ హాయ్ శ్రద్ధా, ఎలా ఉన్నావ్? అని పలకరించారు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమాలోని ఐకానిక్ డైలాగ్ చెప్పమని ప్రోత్సహించారు. ఇద్దరూ కలిసి పుష్ప సిగ్నేచర్ బియర్డ్ స్ట్రోక్ చేయగా, అల్లు అర్జున్ చప్పట్లు కొడుతూ “డ్యామ్ క్యూట్” అని మెచ్చుకున్నారు. చివరగా నువ్వు కోలుకున్న తర్వాత హైదరాబాద్‌కు రా అని చెప్పారు. ఏమవ్వాలనుకుంటున్నావ్ అని అడగగా, శ్రద్ధ డాక్టర్ అవ్వాలని ఉందని బదులిచ్చింది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. సినిమాల విష‌యానికి వ‌స్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె కూడా నటిస్తోంది.
🏠 Home