🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 20 Jun, 2026 | Page: 1

మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చేనేత కార్మికులు

వరంగల్, జూన్ 20 (సుదీక్ష న్యూస్): చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు టెస్కో ద్వారా నేత కూలీలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎదుట రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత మాట్లాడుతూ, ఇటీవల చేనేత కార్మికుల నిరసన దీక్ష శిబిరాన్ని మంత్రి సందర్శించిన సందర్భంగా కార్మికులు చేసిన ప్రధాన డిమాండ్ అయిన 30 శాతం నేత కూలీల పెంపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు. మార్చి 31, 2026 నుంచి అమలులోకి వచ్చేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ద్వారా ఉత్తర్వుల కాపీ అందిందన్నారు.

అలాగే చేనేత సహకార సంఘాల్లో నిల్వ ఉన్న కార్పెట్లు, బెడ్‌షీట్ల కొనుగోళ్లకు చర్యలు చేపట్టడంతో పాటు మరో రెండు లక్షల కార్పెట్లు, రెండు లక్షల బెడ్‌షీట్లకు ఇండెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో చేనేత కార్మికుల్లో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతగా చేనేత కార్మికులు స్వీట్లు పంచుకొని, మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు దాసరి రాజశేఖర్, సామల శంకర్, పోరండ్ల సుదర్శన్, ముదిగొండ నాగరాజు, ఆడెపు నాగభూషణం, ఎండీ అంకూస్, దాసరి సాంబయ్య, కొంగ రవి, ఆడెపు మార్కండేయ, దేవులపల్లి సమ్మయ్య, అలాగే సహకార సంఘాల ప్రతినిధులు అడిగొప్పుల సంపత్, దువ్వల రాజేందర్, యెలుగం సాంబయ్య, పిట్ట రాములు, ఆడెపు రవి, బొల్లు సతీష్, నంబి మురళి, పెండెం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేసిన మంత్రి కొండా సురేఖకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home