🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 21 Jun, 2026 | Page: 1

*కాకతీయ కోటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం*

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ను పురస్కరించుకుని చారిత్రక ఖిలా వరంగల్ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సుమారు 500 మంది విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,కూడా చైర్మన్ ఏనుగాల వెంకటరామిరెడ్డి గార్లు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో అవసరమని అన్నారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని, అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
🏠 Home