చిటికెడు వాముతో ఎన్నో లాభాలు - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
జీవనశైలి, ఆహారపు అలవాట్లు, విపరీతమైన ఒత్తిడి కారణంగా చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఎసిడిటీ ఒకటి. అయితే, గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో ఒక టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
బాలింతలకు మేలు : గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు వాము చాలా మంచిదంటున్నారు నిపుణులు. గర్భిణులకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని ఇది దూరం చేస్తుందంటున్నారు. అలాగే, బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొంటున్నారు.
రాత్రిపూట ఈ ఆహారం తింటున్నారా? - ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లేనట!
శ్వాసకోశ వ్యవస్థ : వాములోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఇందులోని థైమోల్ ముక్కు రంధ్రాలను శుభ్రం చేస్తుందని, శ్లేష్మాన్ని తొలగించడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుందని చెబుతున్నారు. ఆయుర్వేదంలో దీన్ని కడుపు ఉబ్బరం, అలసట, విరేచనాలు, పొత్తికడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి వివిధ చికిత్సలకు ఉపయోగించే వారని National Library of Medicine పేర్కొంది.
గుండె ఆరోగ్యం : వాము శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటులో విశేషమైన పాత్ర పోషిస్తుందని National Library of Medicine తేలింది.
ఆ సమస్యల నుంచి : వాములో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే, ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.
నోటి శుభ్రతకు : వాము నూనెను టూత్‌పేస్ట్, మౌత్ వాష్‌ల్లో వాడతారట. ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి నోటి నుంచి దుర్వాసన రాకుండా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, కొద్దిగా వామును నోట్లో వేసుకుని నమిలినా మేలంటున్నారు.
మరికొన్ని :
పీరియడ్స్ టైంలో కొంతమందికి కడుపునొప్పి రావడం సర్వసాధారణం. అలాంటి, సమయంలో వేయించిన వామును పాలలో కలిపి, వేడి చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. వాము కడుపు నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని National Library of Medicine పేర్కొంది.
అలాగే, వామును కూరలు, పకోడీలు, పరోటాలు, చపాతీలు మొదలైన ఆహార పదార్థాల తయారీలో వాడితే అటు రుచికి రుచి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
వాము వేసి మరిగించిన నీటిని గోరువెచ్చగా అయ్యే దాకా పక్కన పెట్టాలంటున్నారు. ఆపై ఈ నీటితో పుక్కిలిస్తే పంటి నొప్పులు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.