పేదల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు పోతుంది : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్ఐఆర్ (ఓటరు జాబితా సవరణ ప్రత్యేక సవరణ కార్యక్రమం) ప్రక్రియ చాలా సీరియస్ అంశమని, అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ విషయంలో సరిగా వ్యవహరించకపోతే పేదలకు అన్యాయం జరుగుతుందని, వారి ఓట్లు పోతే ఆధార్, రేషన్ కార్డు పోతుందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్షమించే ప్రసక్తే లేదు : ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఐపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొంతమంది నాయకులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ అవగాహన సదస్సుల రిపోర్ట్ తన దగ్గర ఉందన్న సీఎం, పార్టీ తరఫున ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశంపై మరిన్ని అవగాహన సదస్సులు జరగాలన్నారు. ఎస్ఐఆర్పై మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో పార్టీ ఆదేశాలను పట్టించుకోని వారి స్థానంలో మరొక ఇన్ఛార్జిని నియమిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పనిచేయని వారికి 10 రోజులు సమయం ఇచ్చి చూస్తామని, లేకుంటే వారి స్థానంలో మరొకరిని నియమిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్పై పార్టీ సర్పంచ్లతో గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు.