సామాన్య ప్రజలపై సన్నబియ్యం పిడుగు - 20 శాతం పెరిగిన ధరలు!
గ్యాస్, ఇంధన, నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో లబోదిబోమంటున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఇప్పుడు మరో పిడుగు పడింది. అదే సన్నబియ్యం. గడిచిన ఇరవై రోజుల్లో వీటి ధర ఏకంగా 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు మిల్లర్లు, బియ్యం వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా జేఎస్‌ఆర్, ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ, బీపీటీ వంటి సన్నాల రకాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
పలు రాష్ట్రాల్లో వరి ఉత్పత్తి తగ్గడం, తెలంగాణలో ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం వంటి కారణాలతో మార్కెట్లోకి వచ్చే ధాన్యం తగ్గిపోయింది. ఇవే ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కొందరు మిల్లర్లు సన్నబియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చి క్వింటాకు ఏకంగా రూ.800 నుంచి రూ.1000 వరకు ఎగబాకాయి. గతంలో కిలో రూ.46 నుంచి రూ.55 ఉంటే ఇప్పుడు బాయిల్డ్, రారైస్, తక్కువ రకం, ప్రీమియం క్వాలిటీని బట్టి రూ.55 నుంచి రూ.63కు పెరిగాయి.
వివిధ రాష్ట్రాల్లో తగ్గిన సాగు : మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో గతంలో కంటే సన్నాల సాగు తగ్గినట్లు మిల్లర్లు, బియ్యం వ్యాపారులు చెబుతున్నారు. భారీ డిమాండ్ ఉండే జేఎస్‌ఆర్ రకం మహారాష్ట్రలో అత్యధికంగా పండిస్తున్నారు. ఈసారి అక్కడ దిగుబడి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమని రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి వెల్లడించారు. తుంగభద్ర జలాశయానికి మరమ్మతుల కారణంగా కర్ణాటక ప్రభుత్వం యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించింది. ఫలితంగా రాయచూరు, బళ్లారి, కొప్పళ తదితర జిల్లాల్లో వరిసాగు నీటి వసతి లేని కారణంగా నిలిచిపోయింది. అక్కడి వ్యాపారులు నారాయణపేట, గద్వాల, నిజామాబాద్, బాన్సువాడ, బోధన్ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో సన్నధాన్యం కొనుగోలు చేశారు. బెంగళూరు సహా కర్ణాటకలోని వివిధ మార్కెట్లకు తరలించడంతో రాష్ట్రంలో సన్నబియ్యం కొరత ఏర్పడుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రభుత్వం వద్ద 10 లక్షల టన్నుల నిల్వలు : గతంలో దొడ్డు బియ్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు, సన్నాలు ప్రైవేటు మార్కెట్లోకి వెళ్లేవి. ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో ఖరీఫ్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే భారీ స్థాయిలో వెళ్లింది. దీంతో ప్రభుత్వం వద్ద అవసరానికి మించి సుమారు 10 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదారు నెలలుగా ఈ ధాన్యం మార్కెట్లోకి రాకపోవడం కూడా ప్రస్తుత కొరతకు ఓ కారణంగా తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాలు, విదేశాలకు తెలంగాణ సన్నబియ్యం : తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యానికి బోనస్ ఇవ్వడం, రైతులు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో బోనస్ ప్రకటిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సన్నాల దిగుబడులు పెరిగి ధరలు కూడా దిగివస్తాయి. అదేవిధంగా తెలంగాణలో 5 లక్షల టన్నుల సన్న ధాన్యం వేలం పూర్తయ్యి ఈ నిల్వలు త్వరగా మార్కెట్లోకి వస్తే ధరలు వీలైనంత తగ్గే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాల బియ్యం ఎగుమతిదారుల అసోసియేషన్ ప్రతినిధి బీవీ కృష్ణారావు చెప్పారు. ఇదిలా ఉండగా సుమారు వెయ్యి మంది మిల్లర్లు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు విక్రయిస్తున్నారని తెలిసింది.