రామన్నగూడెం వద్ద గోదావరి కరకట్ట రక్షణకు జియో ట్యూబ్స్ పనులు పరిశీలించిన మంత్రి సీతక్క
ములుగు, సుదీక్ష న్యూస్:
ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నది కరకట్ట భద్రత కోసం నూతన సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న జియో ట్యూబ్స్ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, కరకట్ట భద్రత, వరదల సమయంలో కరకట్ట దెబ్బతినకుండా చేపడుతున్న రక్షణ చర్యలను మంత్రి పరిశీలించారు. అధికారులు మ్యాప్ ఆధారంగా గోదావరి ప్రవాహ తీరు, కరకట్ట పరిస్థితులు, జియో ట్యూబ్స్ ఏర్పాటు విధానం, చేపడుతున్న రక్షణ చర్యలపై వివరాలను మంత్రికి వివరించారు.
జియో ట్యూబ్స్ పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.