🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 26 Jun, 2026 | Page: 1

మక్కలు క్వింటా రూ.2,430

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కజొన్నలకు ఎన్నడూ లేనంత ధరలు గురువారం పలికాయి. క్వింటా మక్కజొన్నలకు రూ.2430లు ధర పలికింది. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన సాంబారి శ్రీను మక్కలను మార్కెట్‌కు అమ్మకానికి తీసుకురాగా.. స్వాతి ఎంటర్‌ప్రైజెస్‌ అడ్తిద్వారా ప్రేమ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఖరీదు చేశారు. ఇది మార్కెట్‌ చరిత్రలోనే అ ధిక ధరగా నమోదైంది. రెండు నెలల కిందట వరకు మక్కజొన్నలను మార్క్‌ఫెడ్‌కు క్వింటా రూ.2400లకు విక్రయించేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు.
ట్రాన్స్‌పోర్టు, హమాలీ, సుతిలీ వేయడం కోసం ఇలా అన్నింటికీ డబ్బులు పెట్టిరోజుల కొద్ది వేచి చూశారు. ఒక క్వింటా సుమారు రూ.300 నుంచి 400 ఖర్చు చేశారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్‌ వ్యాపారులు మక్కజొన్నలను రైతుల నుంచి నేరుగా రూ.2,430 కొనుగోలు చేశారంటే పరిస్థితి ఎంత మారిందో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలలు ఓపిక పట్టినందుకు రైతుకు రూ.300 నుంచి 400 వరకు అదనపు ఆదాయం వచ్చినట్లే.. ఎలాంటి ఎదురు చూపులు లేకుండా అదేరోజు మార్కెట్లో విక్రయించి అప్పుడికప్పుడే డబ్బులు తీసుకుని వెళ్లాడు.
🏠 Home