మేము మెరుగైన స్థితిలో ఉన్నాం..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ రేసులో నిలిచిన భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియా పరీక్షకు సిద్ధమవుతోంది. గ్రూప్ ఏ నుంచి రెండో స్థానంలో నిలిచిన టీమిండియా ఆసీస్‌ను ఓడిస్తే ఆరు పాయింట్లతో సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. దాంతో.. ఎలాగైనా కంగారూలను కంగుతినిపించాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పట్టుదలతో ఉంది. కీలక మ్యాచ్ కావడంతో గెలుపుపై భారత్ ధీమాతో ఉంది. కానీ, ఒత్తిడంతా భారత్‌పైనే ఉందని, తాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్ (Sophie Molineux) అంటోంది.
చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించేందుకు భారత జట్టు పక్కాగా సిద్ధమవుతోంది. నాలుగు విజయాలతో జోరుమీదున్న ఆసీస్‌ను నిలువరించేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మొలినెక్స్ మాట్లాడుతూ.. ఒత్తిడంతా టీమిండియాపైనే ఉందని చెప్పింది.