🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 27 Jun, 2026 | Page: 1

భారత్, పాక్ మధ్య దౌత్యం..

పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇరు దేశాల డీజీఎమ్‌ఓల మధ్య హాట్‌లైన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, తెర వెనుక మాత్రం చర్చలు జరుగుతున్నట్టు పాక్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
ఇరు దేశాల ప్రభుత్వాలతో దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తులు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఇది ఇరు దేశాల మధ్య టైర్-2 దౌత్యమన్న వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇరు దేశాల ప్రభుత్వాలు నేరుగా (టైర్-1) చర్చలు జరపట్లేదు. అయితే, కొలంబోలో (శ్రీలంక) ఇటీవల భారత్, పాక్‌కు చెందిన కొందరు రిటైర్డ్ మిలిటరీ, దౌత్య అధికారులు, రాజకీయ నాయకుల సమక్షంలో ఇరు దేశాల అధికారులు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ చర్చలను ట్రాక్-1.5గా వర్ణిస్తూ కథనాలు వచ్చాయి. దీంతో, అసలు ఏం జరిగిందనేదానిపై సస్పెన్స్ నెలకొంది.
🏠 Home