నిండు జీవితానికి రెండు చుక్కలు.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి: పులి రజినీకాంత్
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని 10వ డివిజన్ మచిలీబజార్‌లో ఆదివారం నిర్వహించిన పోలియో కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పులి రజినీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నిండు జీవితానికి రెండు చుక్కలు” అనే నినాదంతో 0 నుంచి 5 ఏళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. గతంలో పోలియో చుక్కలు వేయించిన పిల్లలకు కూడా మరోసారి వేయించడం ద్వారా పూర్తి రక్షణ లభిస్తుందని, పోలియో రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌లకు తీసుకువచ్చి టీకా వేయించాలని, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అందరికీ పోలియో చుక్కలు అందేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ సుష్మ, ఆశా వర్కర్ నవ్య, నర్సింగ్ విద్యార్థులు వర్షిత, సాత్విక, అక్షయతో పాటు బీఆర్ఎస్ నాయకులు సంపతి రఘు, బయ్య శోభన్, మాడిశెట్టి వరుణ్, నెల్లుట్ల సారంగం, పరకాల రాము, సుక్కయ్య, కేస హరీష్ తదితరులు పాల్గొన్నారు.