🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 28 Jun, 2026 | Page: 1

కరాచీ మిలిటరీ స్థావరంపై దాడి.

కరాచీలోని మిలిటరీ స్థావరంపై దాడి ఘటనలో పాక్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇతరులను వేలెత్తి చూపే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద మూకలను కట్టడి చేసుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా చూడటం మానుకోవాలని అన్నారు.

కరాచీలోని సింధ్ రేంజర్స్ మిలిటరీ కాంపౌండ్‌పై శనివారం కొందరు సాయుధులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు పాక్ పారా మిలిటరీ సిబ్బంది మరణించారు. మిలిటెంట్లు వాహనంతో గేటు బద్దలు కొట్టుకుని లోపలకు దూసుకెళ్లారు. గ్రెనేడ్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ కమాండోలు దాదాపు 90 నిమిషాల పాటు శ్రమించి వారిని అంతమొందించారు. ఈ ఘటనలో ఆరుగురు మిలిటెంట్లు మరణించారని పాక్ భద్రతా దళాలు తెలిపాయి. ఒక మిలిటెంట్‌‌ను బంధించామని చెప్పారు.
🏠 Home