టీఎంసీలో చీలిక.. ఇరు పక్షాలకు ఈసీ నోటీసులు
టీఎంసీ నేత రితబ్రత బెనర్జీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఎన్నికల గుర్తుతో పాటు టీఎంసీ నాయకత్వం తమదే అంటూ ఇరు వర్గాలు ప్రకటించుకున్న నేపథ్యంలో ఈసీ గురువారం ఈ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తు, బ్యాంక్ అకౌంట్లు, పార్టీ కార్యవర్గం, ఇతర వ్యవస్థల విషయంలో జులై 6 లోపు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని కోరింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తరువాత రితబ్రత సారథ్యంలో ఒక వర్గం తిరుగుబాటు బావుటా ఎగరవేసిన విషయం తెలిసిందే. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయత్వాన్ని అంగీకరించేది లేదని రితబ్రత తేల్చి చెప్పారు. అంతేకాకుండా, పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో 65 మంది తనకు మద్దతుగా ఉన్నారని అన్నారు. అసెంబ్లీలో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు రితబ్రతను తమ లీడర్‌గా ఎన్నుకున్నారు.