‘ప్రజారోగ్యాన్ని గాలికొదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం’
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ దవాఖానాలు నిరుపేద రోగుల ఆరోగ్యానికి భరోసా ఇస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కోదాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రోగులు పడుతున్న ఇబ్బందులను, అరకొర వసతులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు సకాలంలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వసతులను కల్పించినట్లు తెలిపారు. అయితే రెండున్నర సంవత్సరాల కాలంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ ఈ కేంద్రానికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.
దవాఖానాలో వైద్యులు సిబ్బంది కొరతతో పాటు అవసరమైన మందులు కూడా లేకపోవడంతో రోగులు వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ దవఖానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి రెండున్నర ఏండ్ల క్రితం చివ్వెంల ప్రాంతానికి బదిలీ అయి వేరే వైద్యాధికారి విధులు నిర్వహిస్తున్నప్పటికీ పరిపాలన సంబంధిత అనుమతులు, నిర్ణయాలు బదిలీ అయిన వైద్యాధికారి నిర్వహించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. వైద్యశాలల్లో ప్రసూతి అయిన నిరుపేద తల్లులకు నాడు కేసీఆర్ కిట్లు అందజేస్తే నేడు ఆ ఊసే లేదన్నారు.