కొండా సురేఖ Vs కడియం శ్రీహరి..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డిపై నలుగు మంత్రులు తిరుగుబాటు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజా మంత్రి కొండా సురేఖకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సురేఖకు తెలియకుండానే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఎండోమెంట్ రివ్యూ నిర్వహించారు.Executive Branch
దేవదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కడియంపై స్టేట్ కమాండ్‌కి కాకుండా నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అవాక్కయ్యారు. తనకు చెప్పకుండా హైకమాండ్‌కి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడంపై ఆరా తీశారు.