🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 07 Jul, 2026 | Page: 1

జమ్మూ కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలు..

జమ్మూ కాశ్మీర్‌లోని(Jammu and Kashmir) దోడా జిల్లాలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు(Flash floods )బీభత్సం సృష్టించాయి. రోడ్లు జలమయ మయ్యాయి. థాత్రి, గండోహ్, బలేస్సా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడటం, వరద నీరు ఇళ్లల్లోకి చేరడం వల్ల రోడ్లు ధ్వంసమై సాధారణ జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి వాగులు పొంగిపొర్లడంతో బండరాళ్లు, శిథిలాలు కొట్టుకుపోయి అనేక ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
వరదల కారణంగా థాత్రి వద్ద దోడా-కిష్త్వార్ జాతీయ రహదారి కూడా మూసివేశారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. రాకపోకలకు అంతరాయం కలిగించిన రహదారులపై పేరుకుపోయిన శిథిలాలను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
🏠 Home