దాట్ల జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి మేరెడ్డి రజిత రెడ్డి – కేశవ్ రెడ్డి దంపతుల విశేష కృషి

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా దాట్ల జడ్పీ హైస్కూల్..
CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) ద్వారా పాఠశాల అభివృద్ధి కోసం 48లక్షలు కేటాయింపు
మహబూబాబాద్ / దాట్ల, జూలై 7 (సుదీక్ష న్యూస్) :
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలను తలపించేలా రూపుదిద్దుకోవడంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు మేరెడ్డి రజిత రెడ్డి – కేశవ్ రెడ్డి దంపతుల సేవలు విశేషంగా నిలిచాయి.
గ్రామాభివృద్ధిపై ప్రత్యేక మమకారంతో ముందుకు వచ్చిన ఈ దంపతులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, ఉపాధ్యాయ బృందం సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా సుమారు రూ.48 లక్షలు సమీకరించి పాఠశాల అభివృద్ధికి వినియోగించారు. ఈ నిధులతో నూతన ఆడిటోరియం నిర్మాణం, ఆకర్షణీయమైన విద్యా పెయింటింగ్‌లు, ప్రముఖుల చిత్రాలు, ప్రాంగణ అభివృద్ధి, గ్రౌండ్ లెవలింగ్ వంటి పనులు చేపట్టగా, అదనంగా రూ.2 లక్షల స్వంత నిధులతో కళావేదిక (డయాస్) నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
మేరెడ్డి రజిత రెడ్డి – కేశవ్ రెడ్డి దంపతులు స్వర్గీయ నూకల వృషసేనారెడ్డి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. వారి చొరవతో దాట్ల ప్రభుత్వ పాఠశాల నేడు ఆధునిక సౌకర్యాలతో విద్యార్థులను ఆకట్టుకునేలా మారింది. పదో తరగతి ఫలితాల్లో వరుసగా 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తూ జిల్లా స్థాయిలో గుర్తింపు పొందడంలో కూడా ఈ అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
అంతేకాకుండా, త్వరలో ప్రభుత్వ ఆసుపత్రికి ప్రహరీ గోడ, గ్రామ లైబ్రరీ, రహదారి అభివృద్ధి వంటి మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు మేరెడ్డి రజిత రెడ్డి – కేశవ్ రెడ్డి దంపతులు కృషి చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
గ్రామ ప్రజలు ఈ దంపతుల సేవలను కొనియాడుతూ, దాట్ల అభివృద్ధికి వారు చేస్తున్న కృషి చిరస్మరణీయమని అభినందనలు తెలిపారు.