🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 07 Jul, 2026 | Page: 1

యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గి, కణాల పనితీరు మెరుగుపడటంతో వృద్ధాప్య ప్రభావం నెమ్మదిస్తుంది. దీంతో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని యాంటీఆక్సిడెంట్ వ్యవస్థ బలపడుతుంది. దీంతో కణాలకు నష్టం కలిగించే ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచే కొన్ని రసాయనాల స్థాయిలు తగ్గుతాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ కూడా తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
మెదడు, జ్ఞాపకశక్తికి మేలు
ఎక్కువకాలం యోగా చేసే వారి మెదడులో జ్ఞాపకశక్తి, ఆలోచన, నిర్ణయాలు తీసుకునే భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. అలాగే మెదడు కణాల పెరుగుదలకు ఉపయోగపడే BDNF అనే ప్రొటీన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
బలం, సమతుల్యత
యోగా వల్ల కండరాలు బలపడతాయి. వెన్నెముక, తుంటి భాగాల చలనం మెరుగుపడుతుంది. సమతుల్యత పెరగడం వల్ల వృద్ధుల్లో పడిపోవడం వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఎముకల బలం కూడా మెరుగుపడి ఆస్టియోపొరోసిస్ ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.
గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణ
యోగా చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇన్సులిన్ పనితీరు మెరుగై టైప్-2 మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేందుకు సహాయపడుతుంది.
🏠 Home