🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 08 Jul, 2026 | Page: 1

కొల్లాపూర్ పీజీ కాలేజీ విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి..

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. టీసీ కోసం వచ్చిన ఓ విద్యార్థితో ప్రిన్సిపాల్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తన రూమ్‌కు పిలిపించుకుని లైంగిక దాడికి యత్నించడంతో ప్రైవేట్ పార్ట్ కొరికేశాడు. దీంతో ప్రిన్సిపాల్ నగ్నంగానే పారిపోవడంతో, సదరు విద్యార్థి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.
బాధిత విద్యార్థి ఫిర్యాదు ప్రకారం.. పాలమూరు వర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. టీసీ కోసం వచ్చిన అతనిపై ప్రిన్సిపాల్ కొంతకాలంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థిని తన గదిలోకి పిలిపించుకున్నాడు. అనంతరం విద్యార్థిపై లైంగిక దాడికి యత్నించాడు. ప్రిన్సిపాల్ తనపై చేస్తున్న చిత్రహింసలను భరించలేని విద్యార్థిని కోపంతో ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసి, అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అనంతరం సదరు విద్యార్థి ఇతర విద్యార్థులకు జరిగిన విషయం చెప్పాడు.
🏠 Home