🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 08 Jul, 2026 | Page: 1

నేషనల్ స్పెల్ బీలో ప్రతిభ చాటిన తునికి ఆద్యశ్రీ

హైదరాబాద్ , జూలై 8 (సుదీక్ష న్యూస్) : హైదరాబాద్‌ గాంధీ నగర్ లోని ప్రిమ్ రోజ్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న తునికి ఆద్యశ్రీ జాతీయ స్థాయి నేషనల్ స్పెల్ బీ పోటీల్లో ప్రతిభ కనబర్చి మెడల్, ట్రోఫీతో పాటు రూ.500 నగదు బహుమతిని అందుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది.
ఆద్యశ్రీ సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆర్థిక ప్రిమ్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివితే జాతీయ స్థాయిలో కూడా విజయాలు సాధించవచ్చని ఆద్యశ్రీ నిరూపించిందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆద్యశ్రీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆమె విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పాఠశాల ప్రతినిధులు తెలిపారు.
🏠 Home