చెన్నై సూపర్ కింగ్స్ గడ్డపై బిగ్‌బాష్ లీగ్..
క్రికెట్‌ను ఎంతో ప్రేమించే భారత్‌లో మరో మరో టీ20 లీగ్ మ్యాచ్ అభిమానులను అలరించనుంది. మన ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్‌బాష్ లీగ్(BBL)ను తొలిసారి భారత గడ్డపై నిర్వహించనున్నారు. డిసెంబర్ 12న ఆరంభ పోరుకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోడీ, ఆంటోనీ అల్బనీస్‌ల భేటీ అనంతరం చెన్నైలో బీబీఎల్ మ్యాచ్‌పై స్పష్టత వచ్చింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా కొన్ని కార్యక్రమాల మార్పిడి ఒప్పందం కొనసాగుతోంది. ఈక్రమంలోనే క్రికెట్‌కు విశేషమైన ఆదరణ కలిగిన ఇండియాలో బీబీఎల్ మ్యాచ్ నిర్వహణకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆసక్తి చూపింది. అందుకు.. బీసీసీఐ (BCCI), తమిళనాడు క్రికెట్ సంఘం (TNCA) సైతం అంగీకారం తెలపడంతో ఆరంభ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. డిసెంబర్ 12న తొలిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ పెర్త్ స్కాచర్స్, మెల్‌బోర్న్ రెనెగ్రేడ్స్ తలపడనున్నాయి.
‘భారత్‌లో బీబీఎల్ నిర్వహించడం సరైంది అనిపించకపోవచ్చు. క్రికెట్‌కు విశేషమైన ఆదరణ ఉన్న ఇండియాలో ఆడడం ఎవరికైనా ఇష్టమే. ఐపీఎల్‌కు ఆసీస్‌లో ఎంతో క్రేజ్ ఉంది. అలానే.. బీబీఎల్‌కు మరింత గుర్తింపు తేవడం కోసం ఆరంభ పోరును చెన్నైలో నిర్వహిస్తున్నాం’ అని బీబీఎల్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డాబ్సన్ (Alistair Dobson) పేర్కొన్నాడు.