🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 11 Jul, 2026 | Page: 1

నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్..

వినాయక నగర్, జూలై 11: నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్ సృష్టించింది. ఒకే రాత్రి నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాటా సుమోలో వచ్చిన నలుగురు దొంగలు ముందుగా నిర్మల్ జిల్లాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి పాల్పడ్డారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి, తెల్లవారుజామున ఆర్మూర్ పట్టణంలోని ఓ మెడికల్ షాప్ షట్టర్ ధ్వంసం చేసి అందులోని సుమారు లక్షన్నర నగదును దోచుకున్నారు.
అనంతరం ఆ దొంగల ముఠా తమ వాహనంలో తెల్లవారుజామున 4.55 గంటల వరకు శ్రీనగర్‌ కాలనీకి చేరుకుని.. లక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు తెంపుకుని పరారయ్యారు. ఆ తర్వాత ఉదయం 5.25 గంటల వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడుతో పాటు ఒక చెవికమ్మను లాక్కున్నారు. మరో చెవికమ్మ లాక్కునే ప్రయత్నం చేస్తుండగా బాధితురాలి కేకలు విని ఆమె భర్త బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో వారు టాటా సుమో వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు.
🏠 Home