🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 11 Jul, 2026 | Page: 1

ఇరాన్‌పై 1000 మిస్సైళ్లు ఎక్కుపెట్టాం..

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇవాళ త‌న ట్రుత్ సోష‌ల్‌లో మ‌రోసారి ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయతుల్లా అలీ ఖ‌మేనీ అంత్య‌క్రియ‌ల్లో ట్రంప్‌ను హ‌త‌మార్చాలంటూ నిర‌స‌న‌కారులు ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. కిల్ ట్రంప్ అంటూ ప్ల‌కార్డులు, బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించారు. అయితే ఆ బెదిరింపుల‌కు ట్రంప్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇరాన్‌ను ధ్వంసం చేసేందుకు ఆ దేశంపై 1000 మిస్సైళ్లు లాక్ చేసి, లోడ్ చేసి ఉంచామ‌న్నారు. ఆ త‌ర్వాత ఇంకా వేలాది సంఖ్య‌లో ఇరాన్‌ను స‌ర్వ‌నాశ‌నం చేసేందుకు క్షిప‌ణులు రెఢీగా ఉన్న‌ట్లు ఆయ‌న త‌న వార్నింగ్‌లో పేర్కొన్నారు. అమెరికా మిలిట‌రీ ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేసి బూడిది చేస్తుంద‌న్నారు. హోర్ముజ్ జ‌ల‌సంధిని తెరిచే ఉంచే విష‌యంలో ఇరాన్ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయాల‌ని ట్రంప్ త‌న పోస్టులో తెలిపారు. హోర్ముజ్ మార్గంలో వెళ్తున్న నౌక‌ల‌పై దాడి చేయ‌బోమ‌ని ఇరాన్ క‌ట్టుబ‌డి ఉండాల‌న్నారు. తాజాగా మూడు నౌక‌ల‌పై ఇరాన్ దాడి చేయ‌డం వ‌ల్లే.. ఆ దేశంపై మ‌ళ్లీ అటాక్ జ‌రిగిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

🏠 Home