🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 16 Jul, 2026 | Page: 1

తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు ఏవీఆర్ కన్నుమూత

తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, బీఆర్ఎస్ ఖ‌మ్మం రూర‌ల్ మండల మాజీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆత్కూరి వెంకటేశ్వరరావు (ఏవీఆర్(77) అనారోగ్యంతో కన్నుమూశారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ నాయ‌కుడు బెల్లం వేణుగోపాల్, ఏవీఆర్ నివాసానికి చేరుకుని ఆయ‌న పార్ధీవదేహంపై పూలమాల‌లు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు.

🏠 Home