🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 18 Jul, 2026 | Page: 1

81 ఏళ్ల వృద్ధుడి కాలును కాపాడిన యశోదా వైద్యులు: మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ వైద్యుల ఘనత

వరంగల్, జూలై 18 (సుదీక్ష న్యూస్): మధుమేహం కారణంగా కాలును పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఎదుర్కొన్న 81 ఏళ్ల వృద్ధుడికి అత్యాధునిక వాస్క్యులర్ శస్త్రచికిత్స ద్వారా కాలును కాపాడినట్లు యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన 81 ఏళ్ల కుసుమ భద్రయ్యకు కుడికాలి వేళ్లలో గ్యాంగ్రీన్ ఏర్పడటంతో పాటు కాలికి రక్తప్రసరణ నిలిచిపోయే స్థితి (క్రిటికల్ లింబ్ థ్రెటెనింగ్ ఇస్కీమియా) ఏర్పడిందన్నారు. మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ప్రధాన ధమనిలో తీవ్ర అడ్డంకి ఉన్నట్లు గుర్తించి, అత్యవసరంగా రైట్ ఫెమొరో–పాప్లిటియల్ బైపాస్ శస్త్రచికిత్సతో పాటు గ్యాంగ్రీన్‌కు గురైన కాలివేలిని తొలగించి మిగిలిన కాలును విజయవంతంగా కాపాడినట్లు వివరించారు.ఈ శస్త్రచికిత్సను కన్సల్టెంట్ వాస్క్యులర్ & ఎండోవాస్క్యులర్ సర్జన్ డా. రంజిత్ కుమార్ ఆనందసు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నప్పటికీ సమన్వయ వైద్య బృందం కృషితో రోగి ఆరోగ్యం మెరుగుపడిందని పేర్కొన్నారు.
మధుమేహ రోగులు పాదాలపై చిన్న గాయాలను కూడా నిర్లక్ష్యం చేయరాదని, గాయాలు మానకపోవడం, కాళ్లలో రక్తప్రసరణ తగ్గడం, గ్యాంగ్రీన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించాలని వైద్యులు సూచించారు. సకాలంలో వాస్క్యులర్ చికిత్స అందిస్తే అవయవాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
ఈ సమావేశంలో యశోదా ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ, అత్యాధునిక వాస్క్యులర్ శస్త్రచికిత్సలు, ఆధునిక ఇమేజింగ్ సదుపాయాలు, నిపుణుల బృందంతో తెలంగాణలో క్లిష్టమైన రక్తనాళాల వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
🏠 Home