పీవీ సింధును అభినందించిన సీఎం చంద్రబాబు

జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తెలుగు షట్లర్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇది మరో చారిత్రాత్మక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఈ ఆటలో పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనబరిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లోనూ ఇదే జోరు పీవీ సింధు కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.