యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం..

యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగేసింది. ఈ మేరకు సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో యూసీసీ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 'రాష్ట్ర చారిత్రక వారసత్వానికి ప్రతీకగా, సమాజంలో సమానత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం' అని తెలిపారు. ఈ బిల్లు అమలుతో దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. 'మాకు రామ్ అయినా, రహీమ్ అయినా అందరూ ఒక్కటే. అందరికీ ఒకే...