గుగుర్రంపోడ్ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదు..

బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదైంది.ఈ మేరకు గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను నల్గొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల సైకిల్‌పై వెళ్తున్న ఓ బాలికను నిందితుడు అడ్డగించి, ఆమెతో అసభ్యంగా వ్యవహరించాడు. అనుచితంగా తాకి వేధించాడు. ఇంటికి వెళ్లాక బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. నిందితుడు మాస్క్ ధరించి, పలుచోట్ల తిరిగినట్లుగా గుర్తించారు....