నటి నుంచి వ్యాపారవేత్తగా సాక్షి అగర్వాల్..
దక్షిణాది సినీ నటి సాక్షి అగర్వాల్ తన జీవితంలో మరో కీలక అడుగు వేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తన చిరకాల కలను నిజం చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ‘ఓకూ (OKU)’ పేరుతో ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ కంపెనీని అధికారికంగా ప్రారంభించారు. కొత్త సంస్థ ప్రారంభం సందర్భంగా సాక్షి అగర్వాల్ భావోద్వేగంగా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను గత ఐదేళ్లుగా నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తూ, ఉత్పత్తుల నాణ్యత, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా అత్యుత్తమ నాణ్యత కలిగిన పోషకాహార ఉత్పత్తులను రూపొందించడమే నా లక్ష్యం. ప్రతి ఉత్పత్తి విషయంలో...