చెబితే వినరు - తీరు మార్చుకోరు : కొందరి తప్పులతో 'ఖాకీ'లందరికీ తలవంపులు!
హైదరాబాద్లో నెల రోజుల వ్యవధిలో పోలీస్ శాఖలో జరుగుతోన్న వరుస ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. దీనికంతటికి కొందరు వేసిన తప్పటడుగులు పోలీసు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక భద్రతలో కీలకమైన రక్షక భటులు అవినీతి పరులతో చేతులు కలపటం, వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ పరువు తీస్తున్నారంటూ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే మహిళలు, యువతుల పట్ల కొందరు పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఓ మహిళా ఎస్సైని వేధించిన ఇన్స్పెక్టర్కు మహిళలకు భద్రత కల్పించే విభాగానికి బదిలీ చేయటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరుగుతున్న ఘటనలతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్...