రూ.500 కోట్లతో ఆసుపత్రి కట్టారు - సేవలు మాత్రం అందట్లేదు : ఇక అంతా సర్కారు దయ!
ఇప్పుడున్న ఆసుపత్రి, వైద్య సౌకర్యాలు అక్కడి ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలంటే ఇప్పటికే దాదాపుగా నిర్మాణం పూర్తైన ఆసుపత్రి భవనం వినియోగంలోకి రావాలి. రోగులకు సకల సౌకర్యాలు అందించాలంటే ఇంకా రూ.100 కోట్ల నిధులు కావాలి. ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులన్నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సింగరేణి ఇచ్చినవే. మిగిలిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే అందుబాటులోకి రానున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 355 పడకల ప్రభుత్వాసుపత్రిపై 'ఈటీవీ-ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రభుత్వ సార్వజనీయ ఆసుపత్రి నిర్మాణంలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోంది. సామాజిక బాధ్యతగా సింగరేణి యాజమాన్యం...