తుపాకులతో బెదిరించి, కరీంనగర్‌లో భారీ దోపిడీ.. 66 తులాల బంగారం, 21లక్షల క్యాష్ చోరీ.. ఇంటి అల్లుడిపైనే అనుమానాలు!
కరీంనగర్ పట్టణంలో మరోసారి దోపిడీ కలకలం రేపింది. పీఎంజే జ్యువెల్లరీ షాపులో దోపిడీ ఘటన జరిగిన రెండు నెలలు గడవకముందే, అదే తరహాలో మరో ఇంట్లో దోపిడీ జరిగింది. భగత్ నగర్‌కు చెందిన అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి అర్ధరాత్రి 12 గంటల తర్వాత చొరబడిన దుండగులు.. 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. అజ్మత్ అలీ కుటుంబం భగత్ సింగ్ చౌరస్తాలోని ఓ ఇంట్లో మొదటి అంతస్తులో నివాసం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు అజ్మత్ అలీ గ్రౌండ్ ఫ్లోర్‌లోని లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తుండగా.. బయట మాటువేసిన ఎనిమిది మంది దుండగులు ఒక్కసారిగా...