పేరుకే మహానగరం… చినుకు పడితే చిత్తడి!
17 ఏళ్లుగా సీసీ రోడ్డు లేదు… డ్రైనేజీ వ్యవస్థ లేక నరకయాతన అనుభవిస్తున్న ఇందిరమ్మ కాలనీ వాసులు హనుమకొండ, జూలై 22 (సుదీక్ష న్యూస్): స్మార్ట్ సిటీ, మహానగరం అంటూ అభివృద్ధి మాటలు చెబుతున్నా… హనుమకొండ జిల్లా కాజీపేట మండలం 49వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల పరిస్థితి మాత్రం ఇప్పటికీ దయనీయంగానే ఉంది. కాలనీ ఏర్పడి 17 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లు పూర్తిగా బురదమయంగా మారిపోతున్నాయి. అడుగడుగునా గుంతలు, నీరు నిల్వ ఉండటంతో నడిచి వెళ్లడమే కష్టంగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు...