ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ పథకాలు రావు

బీజేపీ, బీఆర్‌ఎస్‌లు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు వేరు కావొచ్చు కానీ, వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటేనని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణపై బీఎల్‌ఏలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారు : ప్రతి పేదవాడికి మంచి చేసేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, ఈక్రమంలో రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవట్లేదన్నారు. కొడంగల్‌లో నేరుగా ఎదుర్కోలేక తనను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వాళ్ల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి...