లోక్‌సభ 12 గంటల వరకు వాయిదా
ఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ అంశంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనల మధ్య లోక్‌సభ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా పడింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం విపక్షల పట్టుబట్టాయి. సభను ఆర్డర్‌లోకి తెచ్చేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించినా కానీ ఫలితం లేకపోవడంతో లోక్‌సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.