హార్ట్ బర్న్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అంటే ఏమిటి..
మనం ఇష్టమైన ఆహారం తిన్న తర్వాత ఛాతీలో మంట, గొంతు వరకు మంటగా అనిపించడం వంటి సమస్యలను చాలామంది తరచూ ఎదుర్కొంటుంటారు. దీనినే సాధారణంగా హార్ట్‌బర్న్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. రోజువారీ ఆహారపు అలవాట్లే ఈ సమస్యను తగ్గించడంలోనూ, పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ఆహారాలు కడుపులోని ఆమ్ల ప్రభావాన్ని తగ్గించి ఉపశమనం కలిగిస్తే, మరికొన్ని ఆహారాలు లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. అల్లం టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణాశయానికి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థలోని వాపులను తగ్గించి యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అరటిపండు తక్కువ ఆమ్లత్వం కలిగిన పండు. ఇది అన్నవాహిక లోపలి పొరను...