కేటీఆర్‌కు తెలంగాణ జనసేన సూటి ప్రశ్నలు..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌‌కు తెలంగాణ జనసేన సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించింది. ఇటీవల కేటీఆర్.. యువ సంగ్రామ సదస్సులో పాల్గొని విద్యార్థులు, నిరుద్యోగుల గురించి మాట్లాడటంపై టీ.జనసేన స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు న్యాయం జరగాలని తాము కూడా కోరుకుంటామని పేర్కొంది. విద్యార్థుల నిజమైన ఆందోళనలు.. అశాంతిని సృష్టించాలనుకునే శక్తులకు వేదికకాకూడదని వెల్లడించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్.. నిరుద్యోగ అభ్యర్థుల కలలను చిన్నాభిన్నం చేసిందని విమర్శించింది. 2019 ఇంటర్మీడియట్ పరీక్షల గందరగోళం పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని... మీ సొంత ప్రభుత్వంలోనే ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు ఎందుకు మౌనం వహించారని కేటీఆర్‌‌కు తెలంగాణ...