పురుషుల విషయంలో.. మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు

పురుషుల గురించి మహిళలకు చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. వారి అలవాట్లు, ఇష్టాలు, కోపం, ఆనందం వంటి వాటిని సులభంగా గుర్తించగలరు. కానీ చాలా మంది పురుషులు తమ మనసులోని బాధలను, ఆరోగ్య సమస్యలను బయటకు చెప్పరు. అందుకే వారి మానసిక, శారీరక సమస్యలు చాలా వరకు కనిపించకుండా పోతుంటాయి. ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అలాంటి ఐదు ముఖ్యమైన సమస్యలు ఇవే. బాధ్యతల వల్ల వచ్చే మానసిక ఒత్తిడి చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను మోయాల్సిన వ్యక్తిగా పురుషులను సమాజం చూస్తుంది. ఉద్యోగం, ఆదాయం, కుటుంబ భవిష్యత్తు వంటి విషయాలు వారిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి. అయితే తాము బలహీనంగా కనిపిస్తామనే భావనతో ఈ ఒత్తిడిని...