విజయ్ ‘జననాయగన్’గా మెప్పించాడా..?
పురుటి నొప్పులను అనుభవించి, ఒడిదుడుకులను అధిగమించి ఎట్టకేలకు విజయ్ ‘జననాయగన్’ చిత్రం గురువారం విడుదలైంది. రాజకీయ పార్టీ స్థాపించి, నటుడిగా ఇది తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించిన నాటినుంచే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. తాను ప్రచారంలో ఉండగానే ఈ సినిమా పూర్తయి, విడుదలకు సిద్ధమైంది. కానీ పలు రాజకీయ కారణాల వల్ల సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఇవిగాక, తమిళనాట ఈ సినిమా పైరసీకి గురవ్వడం, సెన్సార్ కష్టాలు.. వీటన్నింటి మధ్య, అసలు ‘జననాయగన్’ విడుదల అవుతుందా? అని అంతా భావించిన తరుణంలో తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దాంతో ఈ సినిమాపై...