రోజంతా కూర్చుని పనిచేసేవారు గంటకోసారి 5 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి..
రోజంతా ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని పనిచేయడం ఆధునిక జీవనశైలిలో సాధారణమైపోయింది. అయితే ఈ అలవాటు ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన పరిశోధన ప్రకారం, ప్రతి గంటకు ఐదు నిమిషాల పాటు నడవడం ద్వారా ఈ ప్రమాదాలను కొంతవరకు తగ్గించడంతోపాటు అలసటను తగ్గించి మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవచ్చని తేలింది. ఈ అధ్యయన ఫలితాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురించారు. ఇందులో గంటకోసారి ఐదు నిమిషాల నడక విరామం తీసుకోవడం ఆచరణలో సాధ్యమే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా అత్యంత ప్రయోజనకరమైన పద్ధతిగా గుర్తించారు. అంతేకాకుండా, ఈ చిన్న విరామాలు ఉద్యోగుల పనితీరును...