హోమియోపతి మందులు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
చాలా మంది నెలల తరబడి హోమియోపతి మందులు వాడినా ఫలితం లేదని భావిస్తుంటారు. అయితే, హోమియోపతి నిపుణుల ప్రకారం.. ఇందుకు కారణం చాలా సందర్భాల్లో మందులు కాదు.. వాటిని సరిగ్గా వాడకపోవడం, వైద్యుల సూచనలు పాటించకపోవడం, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలోని పొరపాట్లే. సరైన నియమాలు పాటిస్తేనే హోమియోపతి చికిత్స మెరుగైన ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. మందులు తీసుకునే విధానం చాలా ముఖ్యం హోమియోపతి నిపుణుల ప్రకారం.. ప్రతి మందును ఒకే విధంగా తీసుకోరు. కొన్ని మందులను ఖాళీ కడుపుతో, మరికొన్నింటిని భోజనానికి 20 నిమిషాల ముందు లేదా తర్వాత తీసుకోవాలి. అలాగే మందు వేసుకున్న వెంటనే టీ, కాఫీ లేదా నీళ్లు తాగడం వల్ల...