పార్లమెంట్‌లో ప్రకటన చేయండి.. వీడియోల్లో కాదు
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. పేపర్ లీకేజీల గురించి ప్రధాని మోదీ .. సభలో ప్రకటన చేయకుండా .. వీడియోల్లో ఎందుకు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖన్గే ప్రశ్నించారు. వీడియోల ద్వారా వన్‌సైడ్ మన్‌కీ బాత్ వినిపించాల్సిన అవసరం లేదన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై గురువారం అర్థరాత్రి ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. నీట్ లీకేజీలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నామని, దీనిపై కేబినేట్‌లో చర్చిస్తామని మోదీ తన వీడియోలో తెలిపారు. అయితే పేపర్ లీకులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే అంశంపై వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్రధాని చేసిన...