క్వశ్చన్ పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై ఇక కఠిన చర్యలు..

NEET, JEE వంటి పోటీ పరీక్షల్లో వరుస పేపర్ లీకేజీలు, అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024' చట్టానికి సవరణలు చేసేందుకు ఇవాళ్టి కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ప్రతిపాదిత కొత్త సవరణలు: 1. సుదీర్ఘ జైలు శిక్షలు, భారీ జరిమానాలు: ప్రస్తుతం ఉన్న జైలు శిక్షా కాలాన్ని మరింత పెంచడంతో పాటు, ఆర్థిక జరిమానాలను భారీగా పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2. కాలపరిమితితో కూడిన విచారణ...