ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన..
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఇవాళ విపక్షాలు పార్లమెంట్(Parliament)లో ఆందోళన చేపట్టాయి. నీట్ పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో విపక్షాలు ఈ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ, రాజ్యసభలోనూ ఇదే సీన్ రిపీటైంది. లోక్‌సభలో విపక్ష ఎంపీలతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రధాన్ రాజీనామా కోరుతూ సభలో నినాదాలు చేశారు. విపక్ష ఎంపీలు తగ్గకపోవడంతో.. సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. మళ్లీ సోమవారం లోక్‌సభ సమావేశంకానున్నది. మరో వైపు రాజ్యసభ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ అంశంపై ఇవాళ విపక్షలు చర్చకు పట్టుపట్టాయి. విద్యాశాఖ...