ప్రక్షాళన దిశగా బీఆర్ఎస్..
పెద్దపల్లి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయడం పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి సారించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని సైతం ఆ పార్టీ కైవసం చేసుకున్నది. గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ వర్గీయులు గెలుపొందారు. ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ రామగుండం కార్పొరేషన్ సహ పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు హస్తగతం అయ్యాయి. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్‌లో కొంత ఆత్మస్థయిర్యం దెబ్బతినగా, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు...