కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి.. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై జరిగిన దాడులు అమానుషమని కేటీఆర్ పేర్కొన్నారు. యువత జవాబుదారీతనం కోరుతోందని.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువతపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కేటీఆర్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్‌ఎస్‌ తరఫున కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత...