దేశంలోనే తొలిగా తెలంగాణాలో ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ సేవలు..

దేశంలోనే తొలిసారిగా తెలంగాణాలో ఎలక్ట్రసిటీ అంబులెన్స్ సేవలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదలుపెట్టారు. వైద్య అత్యవసరాలలో 108 సేవలు అందించే తరహాలోనే ఈ కొత్త సేవ పని చేస్తుంది. తీగలు తెగి పడటం, ట్రాన్స్ ఫార్మర్లు పేలటం, షార్ట్ సర్క్యూట్, విద్యుత్ అంతరాయాలు వంటి ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పుడు ప్రత్యేకంగా తయారు చేసే వాహనాలు, అనుభవజ్ఞులైన టెక్నీషియన్ ల బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఖమ్మం జిల్లాలో ఎలక్ట్రసిటీ అంబులెన్స్ లు ఈ అంబులెన్స్ సేవలు మొదట ఖమ్మం జిల్లాలో ప్రారంభించారు. ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఈ సేవ ద్వారా ప్రజలకు 24 గంటలు అత్యవసర విద్యుత్...