హైదరాబాద్‌లో డ్రగ్ పెడ్లర్ హల్‌చల్.. అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌పై కారు ఎక్కించిన వైనం

| హైదరాబాద్‌లో డ్రగ్ పెడ్లర్ బీభత్సం సృష్టించాడు. డ్రగ్స్ మత్తులో ఏకంగా పోలీసులపైకే కారు ఎక్కించాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ అవ్వగా.. మరో కానిస్టేబుల్, సీఐకి గాయాలయ్యాయి. దీంతో సదరు వ్యక్తిపై పోలీసులుమర్డర్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మధ్యాహ్నం అబిడ్స్‌లోని డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమరంలో ఆదివారం మధ్యాహ్నం ఓ కారు అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ వద్దకు రాగానే ఓ వ్యక్తి అతనికి ఒక ప్యాకెట్ అందజేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ప్యాకెట్ అందజేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో...