శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు- ఆందోళన పేరుతో పోలీసుల బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎవరికీ నిరాకరించే అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆందోళనలు జరుగుతున్నాయనే కారణంతో పోలీసులు అతిగా బలప్రయోగం చేయడాన్ని సమర్థించలేమని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనల నిర్వహణకు సంబంధించి ఏకరీతి మార్గదర్శకాలు ప్రోటోకాల్‌ రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా వెల్లడించింది. నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల వ్యవస్థలో అక్రమాలపై విద్యార్థులు చేపట్టిన నిరసనల సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్‌, టియర్‌గ్యాస్‌ ప్రయోగించారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.