పేపర్ లీక్‌లపై కఠిన చట్టం తీసుకొస్తున్నాం- చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి : కిరణ్ రిజిజు
పరీక్షల నిర్వహణలో అక్రమాలను నిరోధించేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును కేంద్రం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. పరీక్షల్లో అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన చట్టాన్ని తీసుకొస్తాందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై లోక్‌సభలో జరిగే చర్చలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని ఆయన కోరారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'ఇది చాలా ముఖ్యమైన రోజు. దేశంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇటీవల విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇప్పుడు...